: జైట్లీ తరపున ప్రచారం చేయనన్న సిద్దూ
లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ తరపున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధూ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన భార్య మాట్లాడుతూ, ప్రచారం చేయకూడదని సిద్ధూ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శిరోమణి అకాళీదళ్ నేతలు సమస్యలు సృష్టించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అకాళీదళ్ తో సిద్ధూకు ఉన్న సంబంధాలు తెగిపోవడంతో అమృత్ సర్ సీటు అతనికి ఇవ్వొద్దని ఆ పార్టీ బీజేపీకి తెగేసి చెప్పింది. దాంతో, బీజేపీ టికెట్ నిరాకరించింది. దానివల్లే ప్రస్తుతం ప్రచారానికి నిరాకరిస్తున్నారని స్పష్టమయింది.