: న్యూజిలాండ్ ఘనవిజయం


టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ పసికూన నెదర్లాండ్స్ పై తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బోరెన్(49), కూపర్(40), స్వార్ట్(26) రాణించారు. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ను మెక్ కల్లమ్(65), విలియమ్సన్(29) జోడి ఆదుకుంది. ఆండర్ సన్(20) లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్ మరో ఓవర్ మిగిలిఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

  • Loading...

More Telugu News