: రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాదులోని గాంధీ భవన్ లో రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను మైనార్టీ వర్గానికి చెందిన యూనిస్ సుల్తాన్ కు చేటాయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి మైనార్టీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.