: గోల్డ్ క్వెస్ట్ కేసులో తాజా ట్విస్ట్


కస్టమర్లను నిండా ముంచిన గోల్డ్ క్వెస్ట్ ఎండీ పుష్పం అప్పలనాయుడు కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్న అప్పల నాయుడిని సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనతో పాటు డైరెక్టర్లుగా ఉన్న అగస్టీన్ జోసెఫ్, పద్మ, రంగనాథన్ వద్ద డబ్బు మొత్తం ఉన్నట్లు విచారణలో ఆమె వెల్లడించారు. అలాగే తన పేరున ఉన్న నగదు వివరాలను కూడా ఆమె దర్యాప్తులో తెలిపారు.

ఈ కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం ఈరోజు సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. చెన్నైలోని బంగారం, వెండి కాయిన్స్ గోడౌన్ ను సీఐడీ సీజ్ చేసింది. దీనికి సంబంధించి విలువలు లెక్కకట్టే బాధ్యతను సీఐడీ కస్టమ్స్ అధికారులకు అప్పగించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా, శ్రీలంక డైరెక్టర్లపై కేసులు నమోదు అయ్యాయి. అప్పల నాయుడు మలేషియా కేంద్రంగా మనీ సర్క్యులేషన్ రాకెట్ ను నడిపినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News