: ఏఎస్పీ సమక్షంలో సీఐల తోపులాట
విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఇద్దరు సీఐల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ఎలమంచిలి సీఐ మల్లేశ్వరరావు, అరకు సీఐ మురళి మధ్య ఎన్నికల సామగ్రి పంపిణీ విధుల విషయమై ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. ఘర్షణ పడిన సీఐలను ఏఎస్పీ ఫకీరప్ప బయటకు పంపినట్టు తెలుస్తోంది.