: 2014 కమలనామ సంవత్సరం: మోడీ
2014 సంవత్సరం కమల, మోడీ నామసంవత్సరం అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల నుంచి స్వేచ్ఛకోసం స్వరాజ్ ఉద్యమాన్ని స్వాతంత్ర్య సమరయోధులు చేస్తే, ఇప్పుడు దేశ ప్రజలంతా సమర్థవంతమైన పరిపాలన కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను, జవాన్లను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశానికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.