: సంజయ్ కేసులో కాంగ్రెస్ జోక్యం చేసుకోదు: కాంగ్రెస్ అధికార ప్రతినిధి


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేసులో కాంగ్రెస్ ఎలాంటి జోక్యం చేసుకోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిని గౌరవిస్తామని ఢిల్లీలో విలేకరులతో ఆయన చెప్పారు. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ బల్బీర్ పుంజ్ మాట్లాడుతూ.. సంజయ్ విషయంలో కోర్టు కొంత ఉదారంగా ఉన్నప్పటికీ.. సామాన్య పౌరుడిగా గుర్తించే చట్టం తన పని తాను చేసిందన్నారు. కోర్టు తీర్పును అతడు గౌరవించాల్సిందేనని అన్నారు.

మరోవైపు
జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ..  సంజు శిక్షను అనుభవించాల్సిందేనన్నారు. మూడున్నర సంవత్సరాల్లో జైలులో ఎన్నో మంచిపనులు చేయవచ్చని సూచించారు. క్షమాభిక్ష పెట్టడం సాధ్యంకాని విషయమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News