: టీఆర్ఎస్ తో పొత్తు వద్దే వద్దు: దామోదర రాజనర్సింహ
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత దామోదర రాజ నర్సింహ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని దామోదర చెప్పారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు.