: తిరుమలలో వేడుకగా సాగిన ‘మెట్లోత్సవం’
పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య వర్ధంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అన్నమాచార్య వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏటా మెట్లోత్సవం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ వేడుకల ప్రారంభ సూచకంగా తిరుపతి అలిపిరి పాదాల మంటపం దగ్గర ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. తాళ్లపాక వంశస్థులైన హరి నారాయణాచార్యులు, టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ దంపతులు మెట్లోత్సవ పూజలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భజన బృందాలు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో అలిపిరి పాదాల మంటపం మార్మోగింది.