: దానం అనుచరులు వేధిస్తున్నారు: విజయరెడ్డి
మాజీ మంత్రి దానం నాగేందర్ పై వైఎస్సార్సీపీ నేత విజయ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, దానం అండతో ఆయన అనుచరులు, పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం అనుచరులు వేధిస్తున్నారని, వారిపై కేసుపెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించే వారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.