: పిల్లుల నుంచి బ్యాక్టీరియా... జాగ్రత్త!
పిల్లి కూనలను ఇష్టంతో పెంచుకోవడం కొందరికి అలవాటు. కానీ, ఇలాంటి వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లుల ద్వారా బ్రిటన్లో ఇద్దరికి టీబీ వ్యాధి సోకింది. న్యూబురీ, బెర్క్ షైర్ లో ఒక్కొక్కరికి పిల్లుల నుంచి బొవిన్ టీబీ వచ్చినట్లు తాజాగా గుర్తించారు. పిల్లి నుంచి ఒక వ్యాధి మనిషికి సోకడం ఇదే ప్రథమమని ఇంగ్లండ్ ప్రజారోగ్య విభాగానికి చెందిన దిలిస్ మోర్గాన్ తెలిపారు. కొంత కాలంగా పిల్లుల నుంచి యజమానులకు టీబీ సోకే ప్రమాదం ఉందంటూ బ్రిటన్లో వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ కేసులు బయటపడ్డాయి. బొవిన్ టీబీ సోకిన కారణంగా బ్రిటన్ లో ఏటా 30వేల పశువులను అంతమొందిస్తున్నారు.