: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం: పొన్నాల
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో వివిధ వర్గాల నేతలు ఆందోళనకు దిగడంతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సీట్ల సర్దుబాటు చేస్తుందని, ఆశావహులు ఆందోళన చెందవద్దని, అందరికీ న్యాయం జరుగుతుందని తాను విశ్వసిస్తున్నానని పొన్నాల తెలిపారు.