: సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సినీ హీరో రామ్ చరణ్


‘వరల్డ్ ఎర్త్ డే’ను పురస్కరించుకుని హైదరాబాదులోని గచ్చిబౌలిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాదు బై సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఈ ర్యాలీలో సినీ హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మెట్రో రైలు ఎండీ ఎంఎస్ రెడ్డి ఈ ర్యాలీకి హాజరయ్యారు. పరిశ్రమలు ఇతర కాలుష్య కారకాలను నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు."

  • Loading...

More Telugu News