: మోడీ సుస్థిర పాలన అందిస్తారని ఆశిస్తున్నా: జేపీ


భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సుస్థిర పాలన అందిస్తారని ఆశిస్తున్నామని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. అందుకే బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నామని జేపీ వెల్లడించారు. హైదరాబాదులో ఈరోజు (శనివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై జాప్యం చేయడం సరికాదని అన్నారు. పార్టీలు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడంపై ఆర్బీఐకి లేఖ రాస్తామని, రుణమాఫీ వల్ల రైతులు నష్టపోతారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News