: కన్నుల పండువగా కొనసాగుతున్న కో్దండరాముని బ్రహ్మోత్సవాలు


తిరుపతిలోని కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. వీటిలో భాగంగా... రెండోరోజైన ఇవాళ (శనివారం) సీతారామచంద్రస్వామివారికి చిన్నశేష వాహనసేవ జరిగింది. విశేష పుష్పాలంకరణతో చిన్నశేష వాహనంలో ఆసీనుడైన కోదండరాముడు రామాలయ మాడవీధుల్లో విహరించారు. ఆదిశేషునిపై విహరిస్తున్న స్వామివారిని తిలకించి పులకరించిపోయిన భక్తుల రామనామస్మరణతో మాడవీధులు మార్మోగాయి. వాహన సేవకు ముందు కోలాటాలు, భజనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఇవాళ రాత్రి స్వామివారికి హంస వాహన సేవ జరుగుతోంది.

  • Loading...

More Telugu News