: ఫేస్ బుక్ లో కామెంట్ చేసి.. అడ్డంగా బుక్కయ్యారు
వాళ్ళు.. భావి భారత పౌరులనదగ్గ ఇంజినీరింగ్ విద్యార్థులు. ఇంటర్నెట్ ను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసినవాళ్ళు. అయితే, ఫేస్ బుక్ లో చెడు వ్యాఖ్యలు చేసి శిక్షకు గురయ్యారు. విషయం ఏంటంటే, త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు కొందరు, ఫేస్ బుక్ లో, అమ్మాయిల హాస్టల్ సూపరింటెండెంట్ గురించి విపరీత వ్యాఖ్యలు చేశారట.
ఆమెపై ఎంత అక్కసు పెంచుకున్నారో గానీ, ఆమెను నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారట సదరు విద్యార్థులు. విషయం, డీన్ వద్దకు వెళ్ళడంతో 57 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వారిని ఆరునెలల పాటు కాలేజి నుంచి సస్సెండ్ చేయడమే కాకుండా, ఓ సంవత్సరం పాటు హాస్టల్ లో అడుగుపెట్టరాదని ఆదేశించారు.