: బీజేపీతో సీట్ల సర్దుబాటుపై టీడీపీ త్రిసభ్య కమిటీ


తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తుల విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో అధినేత చంద్రబాబు పొత్తుల వ్యవహారాన్ని ఆ ప్రాంత నేతలకే వదిలేశారు. సీట్ల సర్దుబాటు అంశం మీరే తేల్చుకోండంటూ పార్టీ నేతలకు బాబు సూచించారు. ఈ మేరకు బీజేపీతో చర్చించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఎల్.రమణ, మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల్లో బీజేపీ నేతలతో ఈ కమిటీయే చర్చిస్తుంది. ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడి సీట్లు ఇవ్వాలి అనే దానిపై వారే నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News