: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ కి చంద్రబాబు నివాళి
ఈ రోజు తెలుగుదేశం పార్టీ 33వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు ఘాట్ ను సందర్శించారు.