: గవర్నర్ కు ఇద్దరు సలహాదారుల నియామకం


ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పాలనను గవర్నర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు సాయంగా ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో పలువురు విశ్రాంత అధికారుల పేర్లను పరిశీలించి, రాజస్థాన్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, మహారాష్ట్ర మాజీ డీజీపీ ఏఎన్ రాయ్ లను ఖరారు చేసింది. పాలనలో వీరిద్దరికీ అనుభవం ఉండటంతో అహ్మద్ పరిపాలన వ్యవహారాలను, రాయ్ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. సాధారణంగా రాష్ట్రపతి పాలనలో మంత్రుల బాధ్యతలను నెరవేర్చడానికి ఈ సలహాదారులను కేంద్రం నియమించడం ఆనవాయతీ. కొద్ది రోజుల్లోనే వారిద్దరూ బాధ్యతలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News