: సెమీస్ చేరిన భారత్


2007 ప్రపంచకప్ విజయం తర్వాత ఒక్కసారి కూడా సెమీ ఫైనల్స్ చేరని భారత్... బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. ఇంకా ఒక్క లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే... మిగతా జట్లకన్నా ముందుగానే సెమీస్ బెర్త్ కన్ ఫాం చేసుకుంది. నిన్న బంగ్లాదేశ్ తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో భారత్ విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ 56 పరుగులు చేశాడు. ధావన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మరోసారి నిరాశ పరిచాడు. కోహ్లీ 57, ధోనీ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో మిశ్రా 3 వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News