: గాయపడిన సంజయ్ మనసు!


యస్.. మున్నాభాయ్ మనసు గాయపడింది...కలత చెందింది. అది ఏ స్థాయిలో అంటే,  ప్రెస్ మీట్ లో.. అదీ మీడియా కెమెరాల కళ్లు తనవైపే తదేకంగా చూస్తున్న వేళ.. బహిరంగంగా ఎక్కి ఎక్కి ఏడ్చేటంతగా..!

ఎందుకిలా?    ముంబై పేలుళ్ల కు సంబంధించి సుప్రీం కోర్టు సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సంజయ్ దత్  పదహారునెలల జైలు శిక్ష అనుభవించేశాడు. ఇంకా,  మూడేళ్ల ఎనిమిది నెలలు సంజయ్ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. సుప్రీం తీర్పువెలువడింది మొదలు సంజయ్ దత్ ను మానసిక క్షోభకు గురిచేస్తోంది ఈ టాపిక్కే.
 
కారణం:     వారి వారి స్వప్రయోజనాలు.. రాజకీయ లబ్ది.. తమ తమ రేటింగ్స్ పెంచుకొనేందుకు చేసిన విన్యాసాలు....  1. సంజయ్ దత్ క్షమాభిక్షకు అర్హుడేనా? 2. మున్నాభాయ్ కి క్షమాభిక్ష దొరుకుతుందా..లేదా.. చర్చాకార్యక్రమం. 3. సంజయ్ సినిమాల సంగతేంటి..? 4. సంజయ్ ప్రొడ్యూసర్ల పరిస్థితేంటి..  ఇలా 21వ తేదీ తీర్పు వచ్చింది మొదలు.. ఓ పక్క మీడియా ప్రత్యేక కథలు, కథనాలు, చర్చా గోష్టులు, బ్రేకింగ్ న్యూస్ లు, ఫోన్ ఇన్ కార్యక్రమాలు. . తమ తమ రేటింగ్స్ పెంచుకునే క్రమంలో మీడియా చేసిన అతి సంజయ్ ఇవాళ అంతలా ఏడ్వడానికి ఒక కారణం

ఇక మరో కోణం : రాజకీయ లబ్ది.. దేశంలోని రాజకీయ పార్టీలు, రాజకీయనేతలు.. 1. సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు. 2. క్షమాభిక్షకు సంజయ్ అర్హుడే. 3. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అతనికే ఎందుకు సడలింపు ఇవ్వడం..? ఇలా వారి వారి స్వప్రయోజనాలు, పార్టీల మనుగడ కోసం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, శివసేన, ఇంకా దేశం లోని మిగతా రాజకీయ పార్టీల నేతలు ఇలా దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ మున్నాభాయ్ మీడియాకు, పొలిటికల్ లీడర్లకు ఒక ఫీడ్ అయిపోయాడు. 

క్షోభిల్లిన మనసు:     ఎంతో గౌరవప్రదమైన, దేశభక్తి గల కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ దత్ కు ఈ చర్యలన్నీ మనస్థాపం కలిగించాయి. ఒంటరిగానో.. కుటుంబంతో కలిసో టీవీ ఆన్ చేస్తే చాలు, తానే హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ అయిపోవడంతో ఆయన ఈ పక్షం రోజుల్లో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఫలితంగానే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అనుభవించిన బాధ కట్టలుతెగడంతో చెల్లిని పట్టుకుని ఎక్కి ఎక్కి ఏడ్చాడు.
 
ఫైనల్ గా ఏమి చెప్పాలనుకున్నాడు?:     నేను క్షమాభిక్ష  కోరుకోవడంలేదు. సుప్రీం కోర్టు వేసిన శిక్షను అనుభవించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కంటే ముందుగానే కోర్టులో సరెండర్ అయిపోతా.. ప్లీజ్ నన్నువదిలేయండి.. నా క్షమాభిక్ష కోసం మీరు చర్చించకండి ప్లీజ్..  ఇదే అతని భావోద్వేగంలోని  సారాంశం. సంజయ్ మనసు బాధపడినందుకు కారణం... మరి తప్పెవరిది?  

  • Loading...

More Telugu News