: బెజవాడలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో పార్టీల నేతలు పడ్డారు. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి విజయవాడలోని 26వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారన్న వార్తలతో... టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఇరు వర్గాలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పీఎస్ ఆవరణలోనే ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పోలీసులు వారిని శాంతపరిచారు.