: నోకియా.. పన్ను కట్టాలయ్యా...!
మొబైల్ దిగ్గజం నోకియా భారీ జరిమానాకు గురైంది. ఈ ఫిన్లాండ్ కంపెనీ రూ. 2000 కోట్ల మేర ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడిందంటూ ఇన్ కమ్ టాక్స్ శాఖ జరిమానా వడ్డించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ వర్గాలు నోకియా వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నోకియా ఈ విషయంలో స్పందించింది. జరిమానా విధించిడం నిజమేనని అంగీకరించింది. అయితే, ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపింది. తాము రెండు దేశాల చట్టాలను గౌరవిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని నోకియా స్పష్టం చేసింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది.