: జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లో గురువారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. మీర్జాపూర్ సమీపంలోని వింధ్యాచల్ ప్రాంతంలో ఓ మహిళా జర్నలిస్టు (30)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అష్టభుజ కొండకు వెళ్తుండగా ఆమెపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని వింధ్యాచల్ రేంజ్ డీఐజీ ఆర్కే శ్రీవాత్సవ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.