: ఆస్ట్రేలియా 178... దీటుగా బదులిస్తున్న విండీస్
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించి విండీస్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. గేల్ 41 (17 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్) పరుగులు, సిమ్మన్స్ 0 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.