: సోనియా, రాహుల్ పై బలమైన అభ్యర్థులనే దింపుతాం: బీజేపీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై బలమైన అభ్యర్థులనే పోటీకి దింపుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు అమేథీ, రాయ్ బరేలీ స్థానాల కోసం పలువురు సరైన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ నాథ్ ను ప్రశ్నించగా, అతని మాటలు చూస్తుంటే మోడీ ప్రజాదరణ పట్ల అసహనానికి గురయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.