: కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల విరాళాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల విరాళాలపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. వేదాంత సంస్థల నుంచి కోట్ల రూపాయల విరాళాలు సేకరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎన్నికల విరాళాలు సేకరించి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని (ఎఫ్ సీఆర్ఏ) ఉల్లంఘించారని న్యాయస్థానం పేర్కొంది. అయితే, తాము ఎఫ్ సీఆర్ఏను ఉల్లంఘించలేదని హోం మంత్రిత్వ శాఖ చెప్పడాన్ని కోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘంతో కలసి ఏఏపీ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టి, ఈ వ్యాఖ్యలు చేసింది. రెండు పార్టీలపై ఆరు నెలల్లో చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది.