: నల్లకోటు వేసుకుని సుప్రీంకోర్టుకు హాజరైన ఉండవల్లి
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు నల్లకోటు వేసుకుని సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రవిభజన వ్యవహారంలో తాను వేసిన పిటిషన్ ను తానే వాదించుకునేందుకు... రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లో ఆయన తన పేరును నమోదు చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే, విభజనకు సంబంధించిన పిటిషన్లన్నీ ఒకే తరహాలో ఉన్నాయని... అన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వాదనలు సోమవారం కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం విచారణ అనంతరం కోర్టు ఆవరణలో మాట్లాడిన ఉండవల్లి... రాష్ట్రవిభజన అన్యాయం అని కోర్టు భావిస్తే సీమాంధ్రులకు న్యాయం జరిగినట్టే అని తెలిపారు.