: కేంద్రానికి, కేసీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు


రాష్ట్ర విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎంఎల్ శర్మ దాఖలు చేసిన తాజా పిటిషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ డిమాండ్ పై న్యాయస్థానంలో వాదించేందుకు అటు కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలని శర్మ కోరడంతో ఆయనను నాలుగో ప్రతివాదిగా చేర్చింది. దాంతో, సుప్రీం కేసీఆర్ కు కూడా నోటీసు పంపింది. అంతకుముందు దాఖలైన పిటిషన్లతో శర్మ తాజా పిటిషన్ ను జతచేయాలని నోటీసులో పేర్కొంది. ఇక విభజనపై దాఖలైన అన్ని పిటిషన్లు ఒకే తరహాలోనే ఉన్నాయని, కాబట్టి అన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా తెలిపి ప్రస్తుతానికి విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News