: టీఆర్ఎస్ కు పొలిట్ బ్యూరో సభ్యుడు సయ్యద్ రాజీనామా


తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం రాజీనామా చేశారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించిన ఇబ్రహీంను నిరాశపరుస్తూ... టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. దాంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇబ్రహీం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. అటు ఇబ్రహీం కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News