: గూగుల్ కంపెనీకి కోటి రూపాయల జరిమానా
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంపెనీపై న్యూఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝుళిపించింది. భారత్ లో అనుచిత వాణిజ్య విధానాలను అనుసరించడంపై చేపట్టిన దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై కోటి రూపాయల జరిమానా విధించింది.
సీసీఐ డైరెక్టర్ జనరల్ కోరిన సమాచారం ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించనందుకే కమిషన్ ఈ జరిమానా విధించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇకపై జరిపే దర్యాప్తునకు గూగుల్ సహకరించాలని కూడా సీసీఐ ఆదేశించింది.