: టీటీడీ గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది: మంత్రి సి.రామచంద్రయ్య


ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన విషయాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నట్లే, టీటీడీ సమాచారం కూడా అలాగే తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని మంత్రి సి.రామచంద్రయ్య చెప్పారు. అయితే టీటీడీకి సమాచార హక్కు చట్టం వర్తించే అంశంపై న్యాయస్థానాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయన్నారు.

ఒక్క టీటీడీయే కాదనీ, రాష్ట్రంలోని ఇతర ఆలయాల ఆస్తులు, వాటి కార్యకలాపాల గురించీ తెలుసుకోవచ్చని తిరుపతిలోని పద్మావతి అతిధిగృహంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి
 అన్నారు. కాగా, తిరుమల అర్చకుల వయోపరిమితి పెంపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నా రు.

  • Loading...

More Telugu News