: గోటితో వడ్లు ఒలిచి... భక్తితో రామయ్య కల్యాణానికి తలంబ్రాలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఎనిమిది మండలాలకు చెందిన ప్రజలు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తితో తలంబ్రాలను సిద్ధం చేశారు. సంప్రదాయబద్ధంగా గోటితో వడ్లు ఒలిచి తలంబ్రాలను తయారు చేశారు. ఏప్రిల్ 1న రాజమండ్రి పుష్కర రేవులో తలంబ్రాలకు హారతి ఇచ్చిన అనంతరం 3న భద్రాద్రికి ప్రయాణం అవుతామని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు అప్పారావు తెలిపారు. భద్రగిరిపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 8న అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.