: భారత మత్స్యకారుల విడుదలకు శ్రీలంక ఆదేశాలు


శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులందరినీ విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే ఆదేశాలిచ్చారు. శ్రీలంకలో జరుగుతున్న యుద్ధ నేరాలపై దర్యాప్తు చేసేందుకు అమెరికా అండతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో నిన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానానికి ఓటు వేయకుండా భారత్ దూరంగా జరిగింది. భారత్ చేసిన మేలుకు ప్రతిఫలంగా తమిళ మత్స్యకారులను విడుదల చేసేందుకు రాజపక్సే ఆదేశాలు జారీ చేశారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఓటింగ్ కు భారత్ దూరంగా ఉన్నా, 23 దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో తీర్మానం ఆమోదం పొందింది.

  • Loading...

More Telugu News