: అమితాబ్ 'కాంప్లాన్ ప్రకటన'పై ఆరోపణలు... ఫిర్యాదు
ఆరోగ్య పానీయం 'కాంప్లాన్' రూపొందించిన కొత్త వాణిజ్య ప్రకటనలో సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల నటించాడు. అందులో 'తాకత్ కా భూత్' అనే పాత్రలో బిగ్ బి కనిపిస్తాడు. మూఢ నమ్మకాలను ప్రచారం చేసేలా అమితాబ్ ప్రకటనలో నటించారంటూ పూణేకు చెందిన సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ ముంబయి మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. రెచ్చగొట్టేలా చిన్న పిల్లలు ప్రకటనలో కనిపించిన సదరు బాలీవుడ్ నటుడిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. అంతేగాక పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. కార్యకర్త ఫిర్యాదును పరిశీలించిన ముంబయి మేజిస్ట్రేట్ ఏప్రిల్ 18కి విచారణ వాయిదా వేశారు.