: ఇది పవన్ 'ఇజం' కాదు ... మోడీ ఇజం!: రాఘవులు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ప్రధానిని చేద్దామంటూ విశాఖ సభా వేదికగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పిలుపునివ్వడంతో ఇతర పార్టీల నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. జనసేన ప్రజల కోసమనుకుంటే... మోడీని ప్రధానిని చేసేందుకు వచ్చినట్లుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఎద్దేవా చేశారు. పవన్ 'ఇజం' మోడీ ఇజంలా ఉందన్నారు. నిన్న రాత్రి విశాఖ సభలో పవన్ కల్యాణ్ జనసేన విధానాలతో కూడిన ఇజం పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పార్టీల నుంచి నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయని రాఘవులు చెప్పారు. ఈ మేరకు ఆయన ఈ ఉదయం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News