: 14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన మన నైనా
రాష్ట్రానికి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ చదువుల్లోనూ రికార్డులు రాసేస్తోంది. 14 ఏళ్లకే డిగ్రీ చదివేసి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ లోని సీతాఫల్ మండి, వివేకానంద డిగ్రీ కాలేజీలో బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ చివరి సంవత్సరం పరీక్షలకు నైనా హాజరైంది. అన్నట్లు ఈ చిన్నది తొమ్మిదేళ్లకే 10వ తరగతి పూర్తి చేసింది. క్రీడలు, చదువు రెండూ తనకిష్టమని నైనా జైస్వాల్ విలేకరులకు తెలిపింది.