తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. జీవకోన రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న జపాలి తీర్థం సమీపంలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు టీటీడీ, ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.