: పవన్ కల్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి: పవన్
ఐదు, పదివేలకు కక్కుర్తిపడే అధికారులను పట్టుకుంటారని, వేలకు వేల కోట్లు దోచుకునే నేతలను ఏమీచేయరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్ ను ఎదిరిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. అందుకే అవినీతి విషయంలో కఠినమైన చట్టం రావాలని అభిప్రాయపడ్డారు. ఆ చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే పవన్ కల్యాణ్ తప్పు చేసినా తల తీసేలా ఉండాలని పేర్కొన్నారు.