: కాంగ్రెస్ మట్టిలో కలిసిపోవడం ఖాయం: పవన్
కాంగ్రెస్ పార్టీపై పవన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. పదికోట్ల మంది తెలుగువారు పిడికిలి ఎత్తితే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ సర్వనాశనమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయమని అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్ళతో పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు.