: దేశ అభివృద్ధి భారతీయ జనతాపార్టీతోనే సాధ్యం: కృష్ణంరాజు


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ‘‘మోడీని ప్రధానిని చేద్దాం’’ (మోడీ ఫర్ పీఎం) నినాదంతో బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు పాల్గొని ప్రసంగించారు. 2009లో బీజేపీ ఓట్ల శాతం పెరిగినా, చాలా స్థానాల్లో చాలా తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు బాట పట్టారని ఆయన గుర్తు చేశారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై, ఈ అయిదేళ్లు ప్రజల నడ్డి విరిచిందని ఆయన విమర్శించారు. జాతీయ రహదారుల విస్తరణ పథకం సహా అభివృద్ధి పనులు గత పదేళ్లుగా ఆగిపోయాయని, కాబట్టి ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని కృష్ణంరాజు జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News