: కోల్ స్కాంపై ఛార్జిషీటులో రాజ్యసభ సభ్యుడి పేరు
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఒక చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ, తాజాగా రెండో ఛార్జిషీటులో ఓ రాజ్యసభ సభ్యుడి పేరు పేర్కొంది. ఆయనే విజయ్ దర్దా. ఇంకా ఇతరులనైన కూడా ఛార్జిషీటులో అభియోగాలు నమోదు చేశారు. దర్దా కంపెనీ ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయింపులకు సంబంధించి వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.