: బీరు కలిపి వండిన మాంసం క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుందట!
బీరు మితంగా సేవించడం ద్వారా లాభాలు ఉన్నట్టే, అమితంగా తాగితే నష్టాలు తప్పవు. ఇప్పుడీ బీరుతో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. బీరుతో మారినేట్ చేసిన మాంసాహారం తినడం ద్వారా క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. మామూలుగా మాంసాహారాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు దానిలో పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) పదార్థాలు తయారవుతాయని, ఇవి అధిక మోతాదులో పేరుకుపోతే క్యాన్సర్ తప్పదని స్పెయిన్, పోర్చుగల్ కు చెందిన యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ హైలెవల్ పీఏహెచ్ స్థాయులు సిగరెట్ పొగలోనూ, వాహనాల పొగలోనూ ఉంటాయట.
కాగా, బీర్ తో మారినేట్ చేయని మాంసాహారంతో పోల్చితే... బీరు కలిపి పంది మాంసాన్ని వండినప్పుడు ఈ పీఏహెచ్ స్థాయులు గణనీయంగా తగ్గిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది.