: 'బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీని నియమించాలి'
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్షునిగా నియమించాలని పశ్చిమబెంగాల్ క్రీడా మంత్రి మదన్ మిత్రా అంటున్నారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం చేసిన సూచనలపై ఆయన పైవిధంగా స్పందించారు. శ్రీనివాసన్ తప్పుకుంటే బోర్డు పగ్గాలు గవాస్కర్ చేపట్టాలని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మిత్రా వ్యాఖ్యానిస్తూ, 'బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు గంగూలీని స్వీకరించనివ్వండి. అతను మన క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్, పైగా, వివాదరహితుడు. ఆ పదవికి అతనే అత్యుత్తమ వ్యక్తి' అని పేర్కొన్నారు.