: ‘సుప్రీం’ బార్ అసోసియేషన్ లో పేరు నమోదు చేసుకున్న ఉండవల్లి
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యునిగా పేరు నమోదు చేయించుకున్నారు. విభజనకు వ్యతిరేకంగా తాను వేసిన కేసును స్వయంగా వాదించుకునే ప్రయత్నంలో ఉండవల్లి ఉన్నట్లుగా సమాచారం. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్ర విభజనను అడ్డుకుంటుందని ఉండవల్లి గత కొంతకాలంగా ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.