: లాడెన్ అల్లుడిని దోషిగా తేల్చిన అమెరికా కోర్టు


అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ అల్లుడు సులేమాన్ అబు ఘయీత్ (48) ను అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అమెరికా జాతీయుల హత్యకు కుట్ర పన్నడంతోపాటు, ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేశాడన్న ఆరోపణలపై అబు ఘయీత్ ను అమెరికా దళాలు టర్కీలో 2013లో అరెస్టు చేశాయి. అతడిపై మోపిన అభియోగాలపై విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ అతడిని దోషిగా పేర్కొంది. దీంతో, అబు ఘయీత్ కు జీవితకాల ఖైదు పడే అవకాశముంది.

లాడెన్ అల్లుడిగా అల్ ఖైదాలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న అబూ ఘయీత్ కువైట్లో ఓ మతబోధకుడిగా వ్యవహరించాడు. 2001, సెప్టెంబర్ 11 టెర్రర్ దాడుల అనంతరం అల్ జజీరా ప్రసారం చేసిన అల్ ఖైదా వీడియోలో లాడెన్ పక్కన కూర్చుని ఉన్న వ్యక్తి ఇతడే.

  • Loading...

More Telugu News