: చిరంజీవి సభలో పవన్ నినాదాలు
బస్సు యాత్రలో చివరి రోజున కేంద్ర మంత్రి చిరంజీవికి ఊహించని పరిణామం ఎదురైంది. అనంతపురం సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించాలని అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, ఇది సమయం కాదని, ఇప్పుడు ప్రస్తావించడం సరికాదంటూ అభిమానులపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన అభిమానులు 'జై పవన్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అసహనం కోల్పోయిన చిరంజీవి... షటప్ అని కూడా అన్నారు.