: మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి: నరేంద్ర మోడీ


ఢిల్లీ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత, దమ్ము ఉంటే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో తెలియజేయడానికి జార్ఖండ్ సజీవ సాక్ష్యమని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీల గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివాసీల అభివృద్ధికి వాజ్ పేయి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆదివాసీల ప్రగతికి పునాదులు వేసిన ఈ ప్రాంతంలో, బొగ్గు, ఐరన్ ఓర్ లాంటి ఖనిజ సంపదకు నెలవైన జార్ఖండ్ లో ఇంత పేదరికం ఎందుకు తాండవిస్తోందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని కొన్ని పార్టీల నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నందుకే ఈ దుస్థితి దాపురించిందని మోడీ విమర్శించారు.

  • Loading...

More Telugu News