: అబుదాబిలో బీసీసీఐ మీడియా సమావేశం క్యాన్సిల్


ఐపీఎల్ ఫిక్సింగ్ కేసుపై సుప్రీం విచారణ నేపథ్యంలో అబుదాబిలో బీసీసీఐ మీడియా సమావేశం రద్దయింది. అబుదాబిలో ఐపీఎల్-7 తొలి అంచె ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, ఫిక్సింగ్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను అనుమతించరాదని స్పష్టం చేసింది.

అంతేగాకుండా, బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ ఇక తప్పుకుంటే మేలన్న రీతిలో పలు సూచనలు చేసింది. శ్రీనీ తప్పుకుంటే గవాస్కర్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అబుదాబిలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే కోరి చిక్కులు కొనితెచ్చుకున్నట్టే అని భావించిన బీసీసీఐ వర్గాలు ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హడావుడిగా ప్రకటించాయి.

  • Loading...

More Telugu News