: తొలి రోజు పదో తరగతి పరీక్ష ప్రశాంతం


రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సరైన వసతులు లేకపోవడంతో కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం పట్టణంలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. తిరుపతి భవానీనగర్ శ్రీ వేంకటేశ్వర పాఠశాలలో కూడా విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తొలి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల చిరునామాలు వెతుక్కుంటూ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వెంట వచ్చారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News